Virat Kohli on Saturday became the first international captain to hit three successive tons in a three-Test series.
కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. తాజాగా కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రీలంకతో నాగ్ పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన కోహ్లీ... చివరిదైన మూడో టెస్టులో కూడా డబుల్ సెంచరీ సాధించాడు.ఫిరోజ్ షా కోట్లా వేదికగా లంకతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. 238 బంతుల్లో 20 ఫోర్లతో డబుల్ సెంచరీని సాధించాడు. దీంతో వరుసగా రెండో డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా అరుదైన మైలురాయిని అందుకున్నాడు.
కోహ్లీకి టెస్టుల్లో ఇది ఆరో డబుల్ సెంచరీ కాగా... ఈ సిరిస్‌లో వరుసగా రెండోది. తద్వారా ఆరు డబుల్ సెంచరీలు సాధించిన భారత దిగ్గజ ఆటగాళ్ల సరసన నిలిచాడు. అలాగే కెప్టెన్‌గా ఆరు డబుల్ సెంచరీలు చేసిన కోహ్లీ... వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా(5)ను అధిగమించాడు.